బీసీ కులగణన రీ సర్వే పకడ్బందీగా జరపాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: బీసీ కులగణన రీ సర్వేను పకడ్బందీగా జరపాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంగెం సూర్యారావు అన్నారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం సమాజ్ కార్యాలయంలో బీసీ కులగణన నివేదికపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 1931, 2025 సంవత్సరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గతంలో 1931 బ్రిటీష్ ప్రభుత్వం జరిగిన కులగణన, ఇప్పుడు మళ్లీ 2025లో చేసిన కులగణన చరిత్రలో నిలిచిపోయే సంవత్సరమని అన్నారు. ఈ సమగ్ర కులగణనలో బీసీలను తక్కువ చేసి చూపించడం, అగ్రవర్ణాలను ఎక్కువ చూసి చూసించడంలో అంతర్యమేమిటో బీసీ సమాజానికి సమాధానం చెప్పాలన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని, ఇది ఎంతో కాలం నిలవదని, రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధంగా బీసీలకు వ్యతిరేకంగా ముందుకు వెళితే ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. బిహార్ రాష్ట్రంలో కులగణన చేస్తే 26 సార్లు అక్కడి సీఎం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌సాగర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనఓటు మనకే వేసుకుందాం అనే నినాదంతో ముందుకెళ్లి అత్యధికంగా బీసీలు గెలవాలని, జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీలో ఉండాలని కోరారు. సమావేశంలో బీసీ నాయకుడు బాబుగౌడ్, బీసీ సమాజ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, ఆయా బీసీ సంఘాల ప్రతినిధులు సతీష్‌యాదవ్, శ్రీనివాసులు, పాండురంగ యాదవ్, సారంగి లక్ష్మికాంత్, బుగ్గన్న, అశ్విని సత్యం, వెంకటనారాయణ, శ్రీనివాస్‌గౌడ్, దుర్గేష్, బి.శేఖర్, తాయప్ప, బీసీ నాయకులు పాల్గొన్నారు.
బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు
సంగెం సూర్యారావు
Comments
Please login to add a commentAdd a comment