అభివృద్ధే చరిత్రలో నిలిచిపోతుంది
పెద్దరేవల్లిలో చత్రపతి శివాజి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ అరుణ ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి తదితరులు.
రాజాపూర్(బాలానగర్): ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ చేసిన అభివృద్ధే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లిలో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చత్రపతి శివాజీకి ఆయన తల్లి ధైర్యాన్ని నూరిపోసిందన్నారు. యువతకు ఆయన పెద్దస్ఫూర్తి అన్నారు. పాలమూరు జిల్లా కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు సీఎం వెనుకబడ్డ జిల్లాపై దృష్టి సారించాలన్నారు. ఉదండపూర్ రైతులు భూములు, ఇళ్లు కోల్పోయారని వారికి పరిహారం అందించాలని కోరారు. పార్టీలు పక్కనపెట్టి సమష్టి కృషితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. శివాజీ విగ్రహాన్ని చూస్తే యువతలో స్ఫూర్తి రావాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు నష్టపోయిన ఉదండపూర్ వాసులకు అండగా ఉంటాన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆదిరమణారెడ్డి, సాధువెంకట్‌రెడ్డి, యాదయ్యగౌడ్, తిరుపతి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, సాహితీరెడ్డి, లింగారెడ్డి, నందీశ్వర్, శ్రీనివాస్‌నాయక్, కోటజనార్దన్, మహేందర్‌రెడ్డి, వెంకట్ బాలవర్దన్‌గౌడ్, లక్ష్మికాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ డీకే అరుణ
సమష్టి కృషితోనే అభివృద్ధి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
పెద్దరేవల్లిలో శివాజీ విగ్రహావిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment