మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పరిధిలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని పీడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమిళనాడు పెరియార్ యూనివర్సిటీలో ఈ నెల 28నుంచి నిర్వహించనున్న అంతర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
స్వల్పంగా పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: మండల కేంద్రంలోని మార్కెట్‌లో బుధవారం ఉల్లి వేలం జోరుగా సాగింది. దాదాపు 2 వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. మార్కెట్ వ్యాపారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటాల్ గరిష్టంగా రూ.3 వేలు, కనిష్టంగా రూ.2 వేల ధర పలికింది. గత వారంతో పోల్చితే రూ.200 వరకు ధర పెరిగింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 45 కేజీల ఉల్లి బస్తా ధర గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.1,000 వరకు అమ్మకాలు సాగించారు. మధ్యాహ్నం జరిగిన ఈ టెండర్లలో కందుల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,711, కనిష్టంగా రూ.6,688 ధరలు లభించాయి. ఆముదాలు క్వింటాల్ రూ.5,771 ధర పలికింది.
Comments
Please login to add a commentAdd a comment