లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
● ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా అన్ని శాఖలు కృషి చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి
పాలమూరు: చిన్నచిన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ఉత్తమమని.. వచ్చేనెల 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సూచించారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గత డిసెంబర్‌లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 14,705 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. మార్చి 8న నిర్వహించే లోక్‌అదాలత్‌లో ఇంకా ఎక్కువ స్థాయిలో కేసులు రాజీ అయ్యే విధంగా సంబంధిత శాఖలు కృషి చేయాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ కోసం మహబూబ్‌నగర్ కోర్టులో ఐదు బెంచీలు, జడ్చర్ల కోర్టులో ఒక బెంచీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 2,029 మంది కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. లోక్‌అదాలత్‌లో రాజీ అయితే మళ్లీ అప్పీల్ పోవడానికి లేదని.. ఫీజులు సైతం తిరిగి చెల్లిస్తారని తెలిపారు. ఫ్రీ లిటిగేషన్ కేసులు, క్రిమినల్, విద్యుత్, భూ పంచాయితీ, రోడ్డు ప్రమాద కేసులు, వివాహం కేసులు, బ్యాంకు, సివిల్, క్రిమినల్, ఎంవీఐ యాక్ట్, డ్రంకన్ డ్రైవ్, చెక్కు బౌన్స్ ఇలా రాజీ కావడానికి అవకాశం ఉన్న ప్రతి కేసును లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తి ఇందిర తదితరులు ఉన్నారు.
నేడు, రేపు రాష్ట్ర ఫుడ్‌కమిషన్ బృందం పర్యటన
పాలమూరు: జిల్లాలో 20, 21వ తేదీల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం పర్యటిస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి వెంకటేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి జడ్చర్లలో పర్యటించి రేషన్ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే 21వ తేదీ శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం ఉంటుందని తెలిపారు.
మన్యంకొండ
హుండీ లెక్కింపు
● రూ.32.39 లక్షల ఆదాయం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం హుండీలను లెక్కించగా.. రూ. 32,39,301 ఆదాయం వచ్చింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. రాత్రి 7 గంటలకు ముగిసింది. హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, దేవాదాయశా ఖ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పాలకమండలి సభ్యు లు వెంకటాచారి, శ్రావణ్‌కుమార్, మంజుల, సుధ, ఐడీబీఐ మేనేజర్ రాజవర్దన్‌రెడ్డి, సత్య సాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు బి.శాంతికుమార్ అన్నారు. వికారాబాద్‌లో గురువారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు జరిగే సబ్ జూనియర్ అంతర్ జిల్లా కబడ్డీ టోర్నీలో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లు బుధవారం బయలుదేరాయి. ఈ సందర్భంగా మెయిన్ స్టేడియంలో జిల్లా జట్లను అభినందించిన శాంతికుమార్ మాట్లాడుతూ టోర్నీలో సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చని అన్నారు. జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, ఉపాధ్యక్షులు దామోదర్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి పాపారాయుడు, గణేష్ పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
Comments
Please login to add a commentAdd a comment