రూ.7 వేలు దాటిన వేరుశనగ ధర
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్ ధర రూ.7వేలు దాటింది. ఈ ఏడాది ఇంత ధర రావడం ఇదే మొదటి సారి అని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యార్డుకు 2,662 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,019, కనిష్టంగా రూ.4,322 లభించింది. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.7,179, కనిష్టంగా రూ.5,300, ఆముదా లు రూ.5,560, జొన్నలు రూ.3,751, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,195, కనిష్టంగా రూ.5,820, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,369, కనిష్టంగా రూ.1,929, మినుములు రూ.7,879 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,802 గా ఒకే ధర లభించింది.
Comments
Please login to add a commentAdd a comment