స్టేషన్ మహబూబ్‌నగర్: సమస్యల పరిష్కారం కోసం అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సభ్యు లు శుక్రవారం జిల్లాకేంద్రంలోని యూనియన్ బ్యాంక్ రీజినల్ కార్యాలయం ఎదుట యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని సమస్యలను పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఐదు రోజుల పనిదినాన్ని ప్రకటించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వచ్చే నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ తిరుమల్‌రెడ్డి, అధ్యక్షుడు జె.రాజే ష్, కెనరా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ ఎంఆర్.జయకర్, అభిలాష్‌రెడ్డి, శివనరేంద్రనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment