నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం
జడ్చర్ల టౌన్: మండలంలోని పోలేపల్లి ఎన్‌ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారిని బుధవారం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ చికిత్స అనంతరం ముగ్గురు విద్యార్థులను మినహా మిగిలిన వారందరిని డిశ్చార్జ్ చేశారు. గురువారం మరో విద్యార్థిని అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఎస్‌వీఎస్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ కోడ్గల్ యాదయ్య పరామర్శించారు. అంతకుముందు యూనివర్సిటీ నిర్వాహకులతో వివరాలను తెలుసుకున్నారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇక్కడి నీళ్లు పడటం లేదని.. అందుకే ఇలా జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు.
విద్యార్థి సంఘాల ఆందోళన..
ఎన్‌ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ నాయకులు వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన ఫుడ్ ఇన్‌చార్జిపై చర్యలు తీసుకోవాలని నినదించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఇలాంటి ఘటనలు మరోమారు చోటు చేసుకోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుంటే యూనివర్సిటీ అనుమతి రద్దు చేయించాలని స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment