రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
బిజినేపల్లి: ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు. మండలంలోని లట్టుపల్లి శివారు భీమునితండాకు చెందిన జాటోతు జాను(33) సోమవారం సాయంత్రం బిజినేపల్లి నుంచి తండాకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే వెల్గొండ గేటు సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందున్న మరో బైక్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన జాను బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జానును స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు.
ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా..
బైకులు ఢీకొని
మరొకరు..
పెద్దకొత్తపల్లి: మండలంలోని సాతాపూర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడని ఎస్‌ఐ సతీష్ తెలిపారు. మొలకుంట సాంబశివుడు(25) తన స్నేహితుడు జగదీష్‌తో కలిసి బైక్‌పై ముష్టిపల్లి నుంచి కుడికిళ్లకు వెళ్తుండగా సాతాపూర్ వద్ద సంగమోని శ్రీకాంత్ బైక్‌పై వస్తూ సాంబశివుడు వాహనాన్ని ఢీకొట్టడంతో సాంబశివుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సాంబశివుడు మాచ్‌పల్లిలో ఆర్‌ఎంపీగా పనిచేస్తుండగా వివాహం కాలేదు. ఈ ఘటనపై తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అదుపుతప్పి..
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడని ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌కాలనీకి చెందిన శ్రీనివాసులు(40) ఆదివారం రాత్రి మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ నుంచి జిల్లాకేంద్రానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై శ్రీనివాసులు భార్య యాదమ్మ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment