విద్యుదాఘాతంతో రైతు మృతి
గోపాల్‌పేట: పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. రేవల్లి మండలంలోని పాత బండరావిపాకులలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. పాత బండరావిపాకుల గ్రామానికి చెందిన తలారి నాగయ్య(59) వ్యవసాయ పొలం కేఎల్‌ఐ డీ–5 కాల్వ సమీపంలో ఉంది. అయితే సోమవారం ఉదయం మోటారు పనిచేయకపోవడంతో పరిశీలించగా మోటారు చుట్టూ నాచు చేరింది. దీంతో అది తీసేందుకు కాల్వలోకి దిగి సరిచేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన స్థానిక రైతులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నాగయ్య భార్య తలారి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాము చెప్పారు.
వివాహిత బలవన్మరణం
రాజాపూర్(బాలానగర్): అదనపు కట్నం వేఽ దింపులు భరించలేక ఓ వివాహిత దుందుభీ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ కథనం ప్రకారం.. బాలానగర్ మండలం గుండేడ్‌కి చెందిన చారకొండ లక్ష్మి(38)కి 17 ఏళ్ల క్రితం గంట్లవెల్లికి చెందిన చారకొండ లింగమయ్య తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.1.50లక్షలతో పాటు 4తులాల బంగారం, బైక్ కట్నంగా ఇచ్చారు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆతర్వాత అ దనపు కట్నం కోసం భర్త వేధించసాగాడు. దీంతో మూడేళ్ల కిత్రం లక్ష్మి తల్లి రాములమ్మ రూ.లక్ష ఇచ్చి అల్లుడికి ఇచ్చారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో లక్ష్మి పుట్టింటించి వచ్చింది. ఆదివారం సాయంత్రం పెద్దమనుషులతో పంచాయితీ పెట్టి సర్దిచెప్పే ప్ర యత్నం చేయగా లింగమయ్య దాడికి పాల్పడటంతో లక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అందరూ కలిసి వెతకగా బాలానగర్ పాత బ్రిడ్జి కింద నీటిలో మృదేహం ఉందని సమాచారం అందగా అక్కడికెళ్లి చూస్తే లక్ష్మి విగత జీవిగా పడి ఉంది. మృతురాలి తల్లి రాము లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుటుంబ కలహాలతో వివాహిత...
మల్దకల్: కుటుంబ కలహాలతో వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమరవాయికి చెందిన కుర్వ బుచ్చమ్మ (42), జమ్మన్న భా ర్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. వారికి ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పొలాన్ని సాగు చేసుకోవడంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఇటీవల కుమారుడి వివాహం చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనికి తోడు కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన బుచ్చమ్మ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. గమనించిన భర్త జమ్మన్న చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
అమరవాయి గ్రామంలో మరో వ్యక్తి కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. అమరవాయికి చెందిన నాగరాజు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో కొంత ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఇంట్లో ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన అతడు.. సోమవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment