హింసకు మనువాద విధానాలే కారణం
మహబూబ్‌నగర్ రూరల్: దేశంలో హింస పెరగడానికి మనువాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విధానాలే ప్రధాన కారణమని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. మహబూబ్‌నగర్‌లోని అరుంధతి భవన్‌లో సోమవారం కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సమావేశాలు రెండో రోజు కొనసాగగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగార్జున అధ్యక్షత వహించారు. ఈ ముగింపు సమావేశానికి స్కైలాబ్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మౌనం వీడాలని, తక్షణమే అంబేడ్కర్ అభయహస్తానికి మార్గదర్శకాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంటరానితనాన్ని నేటి ఆధునిక యువతరం ప్రతిఘటించాలన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనువాదం, దళిత మహిళా హక్కులు అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో పురోభివృద్ధి చెందినా నేటికీ కుల వివక్ష, అంటరానితనం కొనసాగడం దేశం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ను బలోపేతం చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలన్నారు. దళితులకు అసైన్డ్ చేయబడిన భూములకు సత్వరమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మతోన్మాద మూక దాడులు, కుల దురహంకార హత్యలు పెట్రేగిపోతున్నాయని, వాటిని అరికట్టడానికి కులాంతర వివాహితుల రక్షణ చట్టం చేయాలలని కోరారు. కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.అడివయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.కుర్మయ్య, మనోహర్, ఆరూరి కుమార్, డి.రాధాకృష్ణ, ఎం.ప్రకాష్ కారత్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు టి.సురేష్, మంద సంపత్, డి.దినాకర్‌రెడ్డి, డి.రామ్మూర్తి, పరశురాములు, బాలపీరు. బాలకిషన్, దేవేందర్, మల్కయ్య పాల్గొన్నారు.
‘చేవెళ్ల డిక్లరేషన్’ పై సీఎం మౌనం వీడాలి
అంటరానితనాన్ని నేటి యువత ప్రతిఘటించాలి
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment