రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ కొల్లూరులో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి అండర్–10, అండర్–13, అండర్–15 విభాగాల ఆర్చరీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో రాణించిన 18 మంది క్రీడాకారులు గుంటూర్‌లో ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో అండర్–10 కంపౌండ్ బాలికల్లో 20 మీటర్ల శ్రీహిత రాథోడ్, సిద్దిక్షా, ఐషా ఫాతిమా, బాలురలో రోషన్ ఏకలవ్య, హిమనిష్, అండర్–10 ఇండియన్ రౌండ్ 15 మీటర్లలో రోహన్, అండర్–13 బాలికల కంపౌండ్ 30 మీటర్లలో సాయి సమీక్ష, ఐషా ఫాతిమా, షేర్వాణి, సన్నిభా, బాలురలో క్రుతిక్‌శ్రీ వాస్తవ్, సాయి మనీశ్వర్, అండర్–15 కంపౌండ్ 40 మీటర్లలో సాయి సిదిక్షా, సన్నిభా, శేర్వాణి, బాలురలో క్రుతిక్ శ్రీవాస్తవ్, రికర్వు విభాగంలో కౌషిక్ యాదవ్ ఉన్నారు. ఆర్చరీ క్రీడాకారులను సోమవారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి, జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి అభినందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు విజయ్‌కుమార్, ఉదయ్ నాయక్, ఏఓ సీనియర్ సూపరింటెండెంట్ మూర్తి, సీనియర్ సూపరింటెండెంట్ జగన్, జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి రాంచందర్, కోచ్ జ్ఞానేశ్వర్, డాక్టర్ వివేక్ తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ పోటీలకు 18 మంది క్రీడాకారులు
Comments
Please login to add a commentAdd a comment