దివ్యాంగుల కోసం చట్టం చేయాలి
మహబూబ్‌నగర్ రూరల్: స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ప్రాతినిథ్యం కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. సోమవారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక మహబూబ్‌నగర్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు టి.మధుబాబు అధ్యక్షతన సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, జిల్లా గౌరవాధ్యక్షుడు కురుమూర్తి మాట్లాడారు. 2012 నుండి పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం రూ. 300 మాత్రమే చెల్లిస్తుందని, దీంతో దివ్యాంగులు ఎట్లా బతుకుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ప్రాతినిథ్యం చట్ట సాధనకోసం రాష్ట్రవ్యాప్తంగా లక్ష సంతకాల సేకరణ ఉద్యమం కొనసాగుతుందని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు టి.మధుబాబు మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని న్నారు. అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని కోరారు.జిల్లా కార్యదర్శి రామకృష్ణ, నాయకులు పారిజాత, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ క్రీడాకారుడికి
అభినందన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ క్రికెట్ పురుషుల జట్టు తరఫున పలు పోటీల్లో పాల్గొని ఇటీవల విజయ్ (వీజీ) ట్రోఫీకి ఎంపికై న విద్యార్థి డేవిడ్ క్రిపాల్‌ను సోమవారం పీయూ వీసీ శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీయూ విద్యార్థి వీజీ ట్రోఫీకి ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ పోటీల్లో రాణించి పీయూకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పీయూలో క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, పీడీలు సత్యభాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
● ‘లక్ష సంతకాల సేకరణ’లో భాగస్వాములు కావాలి
● ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అడివయ్య
దివ్యాంగుల కోసం చట్టం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment