అది భూదాన్ భూమే..
●
● ధరణిలో సరిదిద్దాలని సీసీఎల్‌ఏ కోర్టు ఆదేశం
ముమ్మాటికి అసైన్డ్ భూమి..
జడ్చర్ల శివారులోని సర్వే నంబర్ 138లో గల భూమి ముమ్మాటికి అసైన్డ్ భూమి. దీన్ని కొందరు తమ పేర్లపై పట్టా మార్పిడి చేసుకుని స్వాహా చేసే ప్రయత్నం చేశారు. దీనిపై తాము సీసీఎల్‌ఏ కోర్టును ఆవ్రయించాం. ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజోపయోగ పనులకు ఉపయోగించాలి.
– ప్రణీల్ చందర్, ఫిర్యాదుదారుడు
స్వాధీనం చేసుకుంటాం..
అసైన్డ్ భూమికి సంబంధించి సీసీఎల్ కోర్టు నుండి వచ్చిన ఆదేశాలను పాటిస్తాం. త్వరలోనే సదరు భూమిని స్వాధీనం చేసుకుంటాం. తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుకెళ్తాం.
– నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల
జడ్చర్ల: భూదాన్ యజ్ఞ బోర్డుకు దానం చేసిన భూమిని అసైన్డ్‌గా మార్చడం.. ఆ భూమిని పీఓబీ(ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్)లో పొందుపర్చడం.. తదుపరి ఇదే అసైన్డ్ భూమిని పట్టాగా పేర్కొంటూ పీఓబీ నుంచి తొలగించడం వంటి పరిణామాలతో వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల పట్టణ శివారులోని సర్వే నంబర్ 138లో మొత్తం 16.32 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి యజమాని మాజీ ఎమ్మెల్యే కొత్త కేశవులు 1957–58 సంవత్సరంలో 2.10 ఎకరాల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకు అప్పగించి.. మిగతా 14.22 ఎకరాల భూమిని తన పేరున ఉంచుకున్నారు. తదుపరి భూదాన్ యజ్ఞ బోర్డుకు అప్పగించిన 2.10 ఎకరాల భూమిని ప్రభుత్వం అసైన్డ్ భూమిగా పేర్కొంటూ ఇతరులకు కేటాయించింది.అంతేగాక ఈ భూమికి సంబంధించి ఇతరులకు రిజిస్ట్రేషన్ కాకుండా పీఓబీలో కూడా చేర్చింది.అయితే ఈ భూమికి ఎన్‌ఓసీ తీసుకువచ్చి తదుపరి చేతులు మారడం వివాదాస్పదంగా మారింది. ఎన్‌ఓసీ తీసుకువచ్చిన వారు తదుపరి నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)గా కూడా మార్చారు. దీంతో కొందరు సీసీఎల్‌ఏ కోర్టును ఆశ్రయించారు. విచారించిన సీసీఎల్‌ఏ కోర్టు భూదాన్ భూమిగా గుర్తించి.. వారి హక్కులను రద్దుచేసి, ధరణిలో భూదాన్ భూమిగా సరిదిద్దాలని పేర్కొంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
జడ్చర్ల శివారులోని అసైన్డ్ భూమి
వినియోగిస్తే మేలు..
జడ్చర్ల వంద పడకల ఆస్పత్రికి చేరువలో ఉన్న అతి విలువైన ఈ భూమిని ఇప్పటికై నా అధికారులు, పాలకులు సద్వినియోగం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, తదితర వాటికి భూములు అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అసైన్డ్ భూమిని త్వరితగతిన స్వాధీన పర్చుకుని అభివృద్ది పనులకు కేటాయించాలని కోరుతున్నారు. కోర్డుకు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, తదితర వాటి ఏర్పాటుకు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అది భూదాన్ భూమే..
అది భూదాన్ భూమే..
Comments
Please login to add a commentAdd a comment