జిల్లాలో ఎస్సెస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
గత పరీక్షలతో పోలిస్తే ఈ సంవత్సరం నిర్వహించే పరీక్షల్లో మార్కుల విధానంలో మార్పులు వచ్చాయి. జీపీఏ విధానం బదులు నేరుగా మార్కులు ఇవ్వనున్నారు. అంతేకాకుండా పరీక్ష సమయంలో జవాబు పత్రాలు విడిగా ఇవ్వడం కుదరదు. 24 పేజీలతో కూడిన బుక్‌లెట్‌కు క్యూఆర్ బార్‌కోడ్ ఉంటుంది. ఇది పూర్తిగా రాస్తేనే మరో బుక్‌లెట్ ఇస్తారు. వీటిలో పేజీలు మిగిలితే విద్యార్థి లేదా ఇన్విజిలేటర్ ఖాళీ పేజీలపై మార్క్ చేయాల్సి ఉంటుంది.
● అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు
● ఈసారి జీపీఏ విధానం కాకుండా మార్కులు ఇవ్వనున్న ప్రభుత్వం
● హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
● ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం
● ’సాక్షి’ ఇంటర్వ్యూలో
డీఈఓ ప్రవీణ్‌కుమార్
పరీక్షలు ప్రశాంతంగా రాయాలి