‘ఉద్యమ గొంతుక మల్లు స్వరాజ్యం’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కమ్యూనిస్టు ఉద్యమ గొంతుక మల్లు స్వరాజ్యం అని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లె గోపాల్ అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతకు మల్లు స్వరాజ్యం ఆదర్శప్రాయురాలు అని పేర్కొన్నారు. మహిళా సంఘం నేతగా, ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకమై వివిధ ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి అని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు నల్లవెల్లి కురుమూర్తి, బి.చంద్రకాంత్, జి.రాజ్‌కుమార్, వరద గాలన్న, సురేష్, ఈశ్వర్, ఆంజనేయులు, భాస్కర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పీయూలో వివిధ విభాగాలకు
హెచ్‌ఓడీల నియామకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పలు డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించి నూతన హెచ్‌ఓడీలను నియమిస్తూ వీసీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బాటనీ హెచ్‌ఓడీగా శివకుమార్‌సింగ్, ఎంబీఏ జావిద్‌ఖాన్, కంప్యూటర్ సైన్స్ సబిత, ఎకానమిక్స్ వెంకట రాఘవేందర్, ఎడ్యుకేషన్ విభాగం ఆంజనేయులు, మ్యాథ్స్ సురేష్, సోషల్‌వర్క్ మాధురిమోహన్, జువాలజీ వేణు, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రవికుమార్‌ను నియమించారు. ఈ సందర్భంగా కొత్త హెచ్‌ఓడీలను వీసీతో పాటు రిజిస్ట్రార్ చెన్నప్ప శుభాకాంక్షలు తెలిపారు.
‘ఉద్యమ గొంతుక మల్లు స్వరాజ్యం’