
తగ్గుతున్న నీటి నిల్వలు..
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పై ఆధారపడి పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఫుల్‌గేజ్ లెవెల్ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 837 అడుగుల దిగువకు నీటిమట్టం చేరింది. డ్యాంలో నీటి నిల్వ 58 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బ్యాక్‌వాటర్ డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలు. అప్పటి వరకు ప్రాజెక్టుల ద్వారా బ్యాక్‌వాటర్‌ను వినియోగించుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తమ వాటాకు సంబంధించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో.. శ్రీశైలం డ్యాంలో ఉన్న 28 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం కేఎల్‌ఐ ద్వారా రోజూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్ డెడ్ స్టోరేజీకి చేరేలోగా పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని ఎత్తిపోసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు.