
కురుమూర్తిస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
చిన్నచింతకుంట: రాష్ట్ర ప్రజలందరిపై కురుమూర్తిస్వామి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం ఉగాది పండగను పురస్కరించుకొని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్లు స్వర్ణసుధాకర్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా కురుమూర్తిస్వామిని దర్శించుకొని.. అనంతరం ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి అరవింద్‌కుమార్‌రెడ్డి, కురుమూర్తిస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, దేవరకద్ర, మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రశాంత్‌కుమార్, కథలప్ప తదితరులు పాల్గొన్నారు.