ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌ఓ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. ఎన్‌వైకే ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాత డ్వామా కార్యాలయంలోని మీటింగ్‌హాల్‌లో ఎయిడ్స్, సుఖవ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవగాహనతో ఎయిడ్స్‌ను నియంత్రించ వచ్చని తెలిపారు. ముఖ్యంగా యువత చైతన్యం కావాలని, ఎయిడ్స్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఆర్‌ఎసీటీఐ డైరెక్టర్ శ్రీనివాస్‌నాయక్, జిల్లా యువజన అధికారి కోటానాయక్, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజర్ శ్రీశైలం పాల్గొన్నారు.
23న మహిళా శక్తి పురస్కారాలు ప్రదానం
స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ మహిళా సాంస్కృతిక సంస్థ పాలమూరు, ప్రమీల శక్తిపీఠం హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లాకేంద్రంలోని భారత్ స్కౌట్స్, గైడ్స్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సాహిత్య సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న మహిళలకు ‘మహిళా శక్తి పురస్కారాలు’ విశ్వావసు నామ ఉగాదిని పురస్కరించుకొని ప్రముఖ సాహితీవేత్తలకు ఉగాది పురస్కారాలతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ కవి డాక్టర్ బాలస్వామి రచించిన నమో శిల్పి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని కవులు, రచయిత్రులు, సాహితీవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
‘టెన్త్’ పరీక్ష కేంద్రాలపై పోలీస్ నిఘా: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రతి కేంద్రం దగ్గర సెక్షన్ 163 బీఎన్‌ఎస్ అమల్లో ఉంటుందని, పరీక్ష కేంద్రాలపై పోలీస్ నిఘా ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని పేర్కొన్నారు. పరీక్షల నేపథ్యంలో ఎలాంటి సభలు, ర్యాలీలు, మైక్ సౌండ్స్, డీజేలు, ధర్నాలు నిర్వహించరాదని తెలిపారు. పరీక్ష సమయంలో స్థానికంగా ఉండే ఇంటర్‌నెట్, జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీస్ సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల దగ్గర పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, పింఛన్ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దీప్లా నాయక్, నల్లవెల్ల కురుమూర్తి కోరారు. బుధవారం తెలంగాణ ఆశా కార్యకర్తల సంఘం (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల వేతనం కోసం ప్రత్యేక గ్రాంటు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ రద్దుపరచాలని, శిక్షణ పూర్తిచేసిన ఆశా కార్యకర్తలకు ఏఎన్‌ఎంగా పదోన్నతి కల్పించాలన్నారు. అనంతరం ర్యాలీగా తెలంగాణచౌరస్తా వరకు చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రాములు, పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.రాంరెడ్డి, సీఐటీయూ నాయకులు కిల్లె గోపాల్, కమర్‌అలీ, ఆశా కార్యకర్తల సంఘం నాయకులు సావిత్రి, పద్మ, యాదమ్మ, హైమావతి, రాధ, సౌజన్య, అనంతమ్మ, అమృత, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌ఓ