నల్లమల పర్యాటకంపై దృష్టి..
రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. టైగర్ సఫారీ, ఎకో టూరిజం, కృష్ణానదిపై లాంచీ స్టేషన్లు, జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పర్చనున్నారు.
● నల్లమలలో పర్యాటక అభివృద్ధితో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గెస్ట్ హౌస్‌ల నిర్మాణాలు, ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేయనుంది. కృష్ణాతీరంలోని సోమశిల వద్ద బోటింగ్, క్యాంపింగ్, కారవాన్ క్యాంపింగ్ సదుపాయాల కోసం ప్రణాళిక చేపట్టింది.