బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన

Published Thu, Mar 20 2025 1:11 AM | Last Updated on Thu, Mar 20 2025 1:09 AM

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన

కల్వకుర్తి టౌన్‌: బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యం, అంబులెన్స్‌ డ్రైవరే కారణమంటూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు పట్టణంలోని సీహెచ్‌సీ ముందు బుధవారం నిరసన తెలిపారు. ఆస్పత్రి గేటు ముందు నిరసన తెలపడంతో ఓపీ సమయంలో రోగులు ఆస్పత్రిలోకి రాకుండా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆస్పత్రిలో వరుస ఘటనలు జరుగుతున్నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. పోలీసులు అక్కడి చేరుకొని గేటు ముందు ధర్నా చేయటం సరికాదని చెప్పటంతో ఆస్పత్రి ముందు రహదారిపై నిరసన తెలిపారు. పలు పార్టీల నాయకులు పాల్గొని బాధితు కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఆస్పత్రి ముందు నిరసన తెలియజేస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఫోన్‌చేసి మాట్లాడారు. మృతురాలి కుంటబానికి పరిహారంతో పాటుగా, ఒకరికి ఏదైనా ఉద్యోగం వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీఇచ్చారు. బాలింత మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి ఉచితంగా అంబులెన్స్‌ సేవలు అందించాలని ఐక్యతా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత అంబులెన్స్‌ సేవలపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఉచిత సేవల కొరకు ప్రారంభించిన ఉద్దేశం బాగానే ఉన్నా దానిని నడిపించే డ్రైవర్‌కు రోగి పరిస్థితి విషమంగా అనిపిస్తేనే వారు సేవలను అందిస్తారని భాధిత కుటుంబసభ్యులు, ఆసుపత్రిలో కొంతమంది సిబ్బంది ఆరోపించారు. సకాలంలో ఆ అంబులెన్స్‌లు స్పందించినా బాలింత మృతిచెందకుండా ఉండేదని కాదన్నారు. వెల్దండ సీఐ విష్ణువర్థన్‌రెడ్డి , ఎస్‌ఐలు మాధవరెడ్డి, మహేందర్‌, కురుమూర్తి, డివిజన్‌లోని పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఆస్పత్రి ఎదుట బంధువుల ధర్నా

ఎమ్మెల్యే హామీతో విరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement