మోనేశ్వర ఆలయంలో చోరీ
మక్తల్: పట్టణంలోని రాయచూర్ రోడ్డు సమీపంలో ఉన్న మోనేశ్వర ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని విగ్రహమూర్తిని, దాదాపు 20 తులాల పంచలోహాల విగ్రహం, 5తులాల వెండి, 5తులాల వినాయకుడి విగ్రహం, హుండీతో పాటు మిగతా వస్తువులను ఎత్తుకెళ్లారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం దేవాలయంలో పూజలు చేసేందుకు పూజారి విష్ణుమూర్తి ఆలయం వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లిచూసే సరికి వస్తువులు మాయమై ఉండటంతో చోరీ జరిగినట్లు కమిటీ సభ్యులకు తెలిపారు. హుండీని పక్కన పొలాల్లో పడేసి వెళ్లారు. మక్తల్ ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి సమాచారం ఇవ్వగా ఆమె అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు చోరీ జరిగినట్లు మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.