నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ)సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడా కనుకొనేందుకు అధికార యంత్రాంగం సహాయక చర్యలను మరింత వేగవంతం చేసింది. గత నెల 22న దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో 8 మంది కార్మికులు అందులో చిక్కుకోగా ఈనెల 9న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్ మృతదేహం గుర్తించారు. మిగిలిన ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగుతుంది. ఇంత వరకు వారి అచూకీ లభ్యం కాకపోవడంతో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ1, డీ2 ప్రదేశాల్లో తవ్వకాలు మమ్మురం చేశారు. డాగ్స్ పసిగట్టిన ప్రదేశాల్లో 8 నుంచి 10 మీటర్ల పొడవున గోతులు తీస్తూ మట్టిన బయటికి పంపించే పనిలో నిమగ్నమయ్యారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న 40 మీటర్ల వద్దకు చేరుకోవాలంటే మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది. కేరళ డాగ్స్ 14 కిలోమీటరు సొరంగం ముందు భాగం 30 మీటర్ల వద్ద కార్మికుల జాడ కనుకొన్నట్లు సమాచారం. అతి క్లిష్టమైన ప్రమాదకరమైన ప్రదేశంలోని మట్టి, రాళ్లు, బురద తొలగింపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తే.. మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని జీఎస్‌ఐ అధికారులు తేల్చినట్లు తెలిసింది. అయితే ఎంతో జాగ్రత్తగా సహాయక చర్యలు కొనసాగించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. సొరంగం ప్రమాదం జరిగిన చోట చివరి 20 మీటర్ల వద్ద తవ్వకాలు జరిపితే పైకప్పు కూలే అవకాశం ఉండటంతో సింగరేణి రెస్క్యూ బృందాలు టైగర్ కాగ్స్ టింబర్ సపోర్టు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మట్టి, రాళ్లు తొలగింపుతో పాటు కార్మికుల గాలింపు చర్యలు ఇంకా మొదలుకాలేదు.
గల్లంతైన కార్మికుల అచూకీ కోసం 29 రోజులుగా గాలింపు
ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు
Comments
Please login to add a commentAdd a comment