లారీ బోల్తా.. నలుగురికి గాయాలు
చారకొండ: లారీ బోల్తాపడి నలుగురు గాయాల పాలైన ఘటన మండలంలోని జూపల్లి సమీపం 167వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంషోద్దీన్ కథనం మేరకు.. కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు ఇనుప చువ్వల లోడ్‌తో వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇనుప ర్యాంపును, అటుగా వస్తున్న ఆటోను ఢీకొని రహదారిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రెవర్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై లారీ పడటంతో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి పొక్లెయిన్ సాయంతో రోడ్డుపై పడ్డ ఇనుప చువ్వలు, లారీని పక్కకు తొలగించారు. ఆటో డ్రైవర్ లోకిలాల్ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ శంషోద్దీన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment