పాలమూరు: జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ నెల 19న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయగా, ఈ నెల 20 నుంచి 21వరకు నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ ఉండగా.. నేడు బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గం అమల్లోకి రానుంది. జిల్లా అధ్యక్షుడి పోస్టుకు అనంతరెడ్డి, నరేందర్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్టుకు నర్సింహారెడ్డి, శ్రీధర్‌రావు, బీఆర్ విల్సన్, సంయుక్త కార్యదర్శి పోస్టుకు అశోక్‌గౌడ్, నాగోజీలు బరిలో ఉన్నారు. మొత్తం 424 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
‘పెద్ద నాలా విస్తరణకు సహకరించాలి’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్థానిక శివశక్తినగర్ నుంచి పాతపాలమూరు బ్రిడ్జి వరకు ఉన్న పెద్ద నాలాను విస్తరిస్తున్నామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి పక్కనే అటు, ఇటు ఉన్న ప్లాట్ల యజమానులు నిబంధనల మేరకు సెట్‌బ్యాక్ వదిలి సహకరించాలన్నారు. పూర్తి వివరాల కోసం తమ కార్యాలయం లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులను సంప్రదించాలని సూచించారు.
పిల్లలకు క్రమం
తప్పకుండా టీకాలివ్వాలి
పాలమూరు: జిల్లాలో సరైన యాక్షన్‌ప్లాన్‌తో రెండేళ్ల లోపు ఉన్న పిల్లలకు టీకాలు ఇచ్చే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఐదేళ్ల పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇమ్యూనైజేషన్ యాక్షన్ ప్లాన్‌పై గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్స్ వారీగా ఏఎన్‌ఎంలు, ఆశలకు ప్రత్యేక లక్ష్యం కేటాయించాలన్నారు. బుధ, శనివారాల్లో యూనిట్స్‌కు వచ్చే తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ టీకాలు తీసుకునే ప్రతి ఒక్కరిని ఆన్‌లైన్ చేసుకునే విధంగా చైతన్యం కలిగించాలన్నారు. టీకాలు తీసుకున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని, అలా చేయడం వల్ల టీకా తీసుకున్న వివరాలు బుక్ లేకపోయినా ఇబ్బంది ఉండదన్నారు. జిల్లాలో బీసీజీ 1300, పెంటా 5 వేలు, ఎంఆర్ 2,600, జేఈ 2,600 టీకాలు ఇస్తున్నామని తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్‌లో టీకాలు ఎక్కువగా అవసరం అవుతు న్నాయన్నారు. నవజాత శిశువులు ఉన్న తల్లిదండ్రలు తప్పక టీకాలు ఇప్పించాలన్నారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పద్మజ, అజహర్ పాల్గొన్నారు.