మహబూబ్‌నగర్ క్రైం: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, రోడ్లపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కు ఎస్పీ కూల్ వాటర్ బాటిల్స్, క్యాప్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల రోడ్లపై నిరంతరం సేవలు అందించే సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎండలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది డీహైడ్రేషన్‌కు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. భవిష్యత్‌లో సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకుని మరిన్ని సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి, భూత్పూర్ సీఐ రామకృష్ణ , ట్రాఫిక్ ఎస్‌ఐ గోపాల్ పాల్గొన్నారు.