పాలమూరు రెడ్డి సేవా సమితి సేవలు అమోఘం
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు రెడ్డి సేవా సమితి సేవలు అమోఘమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని రాజబహదూర్‌రెడ్డి కన్వెన్షన్‌లో ఆదివారం సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తూము ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన పాలమూరు రెడ్డి సేవాసమితి 23వ వార్షికోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాలమూరు రెడ్డి సేవా సమితి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నతస్థానంలో నిలిచిందన్నారు. 23 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. రెడ్డి సేవా సమితి ఏం చేసినా అది సమాజానికి ఉపయోగపడుతుందన్నారు. గతంలో పాలమూరు రెడ్డి సేవా సమితి ఏర్పాటు చేసిన బాలికల హాస్టల్ ఇప్పుడు మహబూబ్‌నగర్ ఫస్ట్ నవరత్నాల కార్యాలయంగా సమాజానికి ఉపయోగపడుతున్నదని, అక్కడ మొదటి బ్యాచ్‌లో 280 మంది మహిళలకు వివిధ ట్రేడ్‌లలో శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. చదువుకు నోచుకొని అన్ని వర్గాల పేద విద్యార్థుల కోసం మహబూబ్‌నగర్ విద్యానిధి ఏర్పాటు చేశామని, మీరంతా విద్యానిధికి చేయూత ఇవ్వాలని కోరారు. డీసీసీబీ అధ్యక్షులు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని నిరుపేదలు స్వయం ఉపాధి కోసం తగు వివరాలతో వస్తే రుణసదుపాయం కల్పిస్తామన్నారు. భక్తమల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుమతి మాట్లాడుతూ రెడ్లు ఆర్థికంగా ఎదిగి తమ పిల్లలకు మంచి విద్యను అందించి వారు జీవితంలో స్థిరపడే విధంగా కృషి చేయాలని కోరారు. అనంతరం రెడ్డి సేవా సమితి 23వ వార్షికోత్సవ సంచికను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్డి హాస్టల్ అధ్యక్షుడు ఎం.వెంకటరంగారెడ్డి, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీవీ నందకుమార్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ టి.పాపిరెడ్డి, సినీ నిర్మాత బసిరెడ్డి, సమితి ప్రధాన కార్యదర్శి వేపూరు రాజేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మద్ది అనంతరెడ్డి, రాఘవరెడ్డి, మల్లు నరసింహారెడ్డి, జి.వెంకట్రాంరెడ్డి, ఎన్.సురేందర్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డి, మే ఘారెడ్డి, వెంకటరాజారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సరస్వతి, స్వరూప, శోభ, వరలక్ష్మి, నర్మద, శశికళ, హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యెన్నం
శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment