జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం సూక్ష్మజీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సూక్ష్మజీవుల అద్భుతాలు – సాధారణ వృక్షజాలం గుండా ప్రయాణం’ అన్న అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించగా ప్రిన్సిపాల్ డా. సుకన్య ప్రారంభించి మాట్లాడారు. వర్క్‌షాప్‌ల నిర్వహణతో విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యవక్తగా ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సహాయ ఆచార్యులు డా. జె.శ్రీదేవి జడ్చర్ల ప్రాంతంలోని సూక్ష్మ జీవజాలం.. వాటి ప్రాముఖ్యత, వేరు చేసే పద్ధతులు, పరిశోధనల గూరించి వివరించారు. అనంతరం వివిధ సూక్ష్మజీవులను వేరుచేసే పద్ధతులు, మెళకువలను నేర్పించారు. కార్యక్రమంలో సూక్ష్మజీవశాస్త్ర అధిపతి డా. మాధురి, 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
సీపీఆర్‌పై అవగాహన..
కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1, 2, 4, ఉమెన్ ఎంపవర్‌మెంట్‌సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్ మాట్లాడుతూ.. ఇటీవల గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువయ్యాయని, ప్రతి విద్యార్థి సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ బాబుల్‌రెడ్డి సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సుకన్య, వైస్ ప్రిన్సిపాల్ నర్మద, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు ప్రవీణ్‌కుమార్, మాధురి, నందకిశోర్, పుష్పలత, రాఘవేందర్‌రెడ్డి, సూరయ్య, జబీన్, రాజేశ్వరి, నర్సింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.