హాస్టల్‌లో విద్యార్థుల ఘర్షణ : ఒకరికి గాయాలు
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని ఎస్సీ ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థులు ఘర్షణ పడగా ఓ విద్యార్థి చెయ్యి విరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. మహబూబ్‌నగర్ రోడ్‌లో ఉన్న ఎస్పీ–ఏ ప్రభుత్వ హాస్టల్‌లో 85 మంది విద్యార్థులు ఉంటున్నారు. 7వ తరగతి విద్యార్థి లోకేష్ ట్రంకు పెట్టే తాళాన్ని విరగ్గొట్టి అందులోని సామగ్రిని కొందరు విద్యార్థులు దొంగిలించారు. ఆ వస్తువులు మీరే తీశారంటూ లోకేష్ కొంతమంది విద్యార్థులను ప్ర శ్నించగా వారంతా గుంపుగా ఏర్పడి కొట్టడంతో ఎడమ చెయ్యి విరిగింది. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఘటన విషయాన్ని హాస్టల్ వార్డెన్ కృష్ణయ్య వద్ద ప్రస్తావించగా.. రాత్రి 8 వరకు హాస్టల్‌లోనే ఉన్నానని, భోజనానికి ఇంటికి వెళ్లి వచ్చేసరికి విద్యార్థులు గొడవపడ్డారన్నారు. గొడవ విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేసి విద్యార్థులను మందలించానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment