
ఊర్కొండపేట ఆలయంలో..
ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ హుండీని బుధవారం ఆలయ చైర్మన్ నారెడ్డి సత్యనారాయణరెడ్డి, ఈఓ సత్యనారాయణరెడ్డి, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వీణాధరి ఆధ్వర్యంలో లెక్కించారు. 2 నెలల 5 రోజులకుగాను రూ.5,10,977 ఆదాయం సమకూరిందని చైర్మన్ వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కృష్ణదేవ, పాలకమండలి సభ్యులు బొందయ్య, మల్లేష్, ఆంజనేయులు, బంగారయ్య, రమేష్, వెంకటమ్మ, మహేష్ అయ్యగారు, నాయకులు మనోహర్‌రెడ్డి, శ్రీశైలం, ఆలయ అధికారులు మారుతీరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.