
ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనుల పరిశీలన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉన్న మినీ ట్యాంక్‌బండ్ వద్ద కొనసాగుతున్న సుందరీకరణ పనులను శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. ఇటీవల ఎమ్మెల్యే యెన్నం ఇక్కడి కట్టపై ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మొత్తం రూ.రెండు కోట్లు ముడా నుంచి కేటాయించామని వివరించిన విషయం విదితమే. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళ నగర ప్రజలు వచ్చి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించడానికి వివిధ పనులు చేపడుతున్నారు. తాజాగా అక్కడి విభిన్నమైన ఆకృతిలో తీర్చిదిద్దిన పెద్ద డోమ్‌కు జాతీయ భావం పెంపొందించేలా మూడు రంగులతో పెయింటింగ్ వేస్తున్నారు.
పీయూలో
ప్రాంగణ ఎంపికలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్‌లో శనివారం ఎంఎస్‌ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా.ఎస్‌ఎన్ అర్జున్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్‌రెడ్డి, హెచ్‌ఆర్ సుబ్బారావుతో పాటు క్యూసీ మేనేజర్లు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతికి భారీ బందోబస్తు
మహబూబ్‌నగర్ క్రైం: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్‌శాఖ పాల మూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దాదాపు 200 మంది బలగాలతో ప్రధాన కూడళ్లు, ర్యాలీ వెంట విధులు నిర్వహించారు. బందోబస్తు విధానాన్ని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడు తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ప్రాంతాన్ని పరిశీలించే విధంగా సీసీ కెమెరాల సహాయంతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ బందోబస్తులో మహిళ సిబ్బంది, ప్రత్యేక విభాగాలు, క్యూఆర్‌టీ బలగాలు, ట్రాఫిక్ పోలీసులు కలిసి సమన్వయంతో పని చేసినట్లు తెలిపారు. ర్యాలీ మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ చేసి ఇతర వాహనదారులకు ఇబ్బందులు రాకుండా చూసినట్లు తెలిపారు.

ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనుల పరిశీలన