చిచ్చుపెట్టిన స్నాక్స్
రాజాపూర్: అనుమతులేకుండా స్నాక్స్ తీసుకున్న విషయంపై ఇరువురు విద్యార్థినుల మధ్య గొడవకు కారణమైంది. క్షణికావేశానికి గురైన ఓ విద్యార్థిని మల్టీవిటయన్ మాత్రలు మింగి ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. వివరాలు.. కేజీబీవీలో వైష్ణవి ఎనిమిది తరగతి చదువుతోంది. శుక్రవారం సాయంత్రం స్కూల్‌లోని స్టాక్‌రూంలో ఉన్న స్నాక్స్‌ను మరికొందరు విద్యార్థినులతో కలసి అనుమతి లేకుండా తీసుకుంది. ఇది గుర్తించిన 9వ తరగతి క్లాస్‌లీడర్ అనుమతి లేకుండా స్నాక్స్ ఎందుకు దొంగిలించారని మందలించింది. ఈక్రమంలో కొంత వాగ్వాదం కొనసాగటంతో 9వ తరగతి విద్యార్థినులు చేయిచేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురై అందుబాటులో ఉన్న ఐదు మల్టీ విటమిన్ మాత్రలను మింగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. గమనించిన సీఆర్‌టి వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్‌చేసి సమాచారమిచ్చి జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో విద్యార్తిని కోలుకుంటుంది. మాత్రలతో ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తేల్చారు. విద్యార్థిని ఘటన తెలియటంతో జీసీడీఓ రాధ, ఎంఈఓ సుధాకర్ ఆస్పత్రికి చేరుకొని వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు అందుబాటులో లేకపోవటంతో మేనమామ, నానమ్మ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థిని వద్ద ఉన్నారు.
సీనియర్లతో గొడవ
క్షణికావేశానికి లోనై విద్యార్థిని
మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం
రాజాపూర్ కేజీబీవీలో ఘటన
ఎలాంటి ప్రమాదం లేదన్న వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment