భర్తను హత్య చేసిన భార్యకు రిమాండ్
మరికల్: భూమి అమ్మగా వచ్చిన డబ్బులు తనకు ఇవ్వలేదని భర్తను తాడుతో హత్య చేసిన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మరికల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. నర్వ మండలం లంకాలకి చెందిన పాలెం అంజన్న(41) నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి డిగ్రీ కళాశాలల్లో అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 20న రాత్రి 7గంటల తర్వాత ఇంటికి వచ్చిన భర్త అంజన్నతో భార్య పాలెం రంగమ్మ పొలం విషయంలో గొడవ పడింది. భర్త పేరు మీద ఉన్న ఐదెకరాల భూమిని తనపేరు మీద చేయకుండా అమ్మేశాడు. అమ్మిన డబ్బులు తనకు ఇవ్వలేదని కోపంతో నిద్రిస్తున్న భర్తను అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో భర్త మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకొని నారాయణపేట కోర్టుకు రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు. నర్వ ఎస్‌ఐ కుర్మయ్య, తిరుపతిరెడ్డి, రఘు, అజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment