రైతన్నకు అకాల నష్టం
జిల్లాలో రైతుల పరిస్థితి ఆగమాగం అవుతోంది. ఓ వైపు సాగునీరు లేక వేల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే.. మరోవైపు ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో... కురిసిన వడగండ్ల వర్షంతో కొందరు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు 1967 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ, కోయిలకొండ, నవాబుపేట, మిడ్జిల్, రాజాపూర్, జడ్చర్ల, భూత్పూర్ మండలాల్లో పంట దెబ్బతింది.
– సాక్షి నెట్‌వర్క్
వివరాలు 9లో u