హక్కుల సాధనకు సమష్టిగా పోరాటం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కార్మికులందరూ ఏకమై హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి బోరింగ్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో నర్సింగ్ హోం కార్మికుల సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే కార్మికులందరికీ అండగా ఉంటామన్నారు. వీరు శ్రమదోపిడీకి గురవుతున్నారని, ఏడాదికి కనీసం 15 రోజుల సెలవులైనా యాజమాన్యాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములుయాదవ్, ఆయా సంఘాల నాయకు లు బాబుమియా, శ్రీనివాసులు, ఆంజనేయులుగౌడ్, మనోహర్, నాగరాజు, సంతోష్, కాశపోగు ప్రసాద్, శివాని, మనీషా పాల్గొన్నారు.
జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో ఈ నెల 26 నుంచి 30 వరకు జరగనున్న జాతీయస్థాయి జూనియర్ (బాలికల) హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. బి.పారిజాత, మాధురి, శ్రీవర్ధినిలు తెలంగాణ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి ఎంపికపై సంఘం సభ్యులు రజినీకాంత్‌రెడ్డి, ఎండీ జియావుద్దీన్, బి.బాల్‌రాజు, ఎండీ అహ్మద్ హుస్సేన్, కోచ్ ప్రదీప్‌కుమార్, పీఈటీ ప్రణయ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటాలని ఆకాంక్షించారు.
న్యూస్‌రీల్
హక్కుల సాధనకు సమష్టిగా పోరాటం