
మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణం
మద్దూరు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మద్దూరు మండలం నందిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ వివరాల మేరకు.. నందిపాడుకు చెందిన బదిగె చిన్న బుగ్గప్ప (50) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. అతడు ఏ పనిచేయకుండా ఉండటంతో తాగడానికి డబ్బులు పుట్టడం లేదు. ఇంట్లో అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై ఈ నెల 26న ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కోస్గిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి సోదరుడు పెద్ద బుగ్గప్ప ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
జడ్చర్ల: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన జడ్చర్ల పట్టణంలోని రంగారావుతోటలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. రంగారావుతోటలో పుష్ప (38) అనే మహిళ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. శుక్రవారం ఆమె కనిపించక పోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. ఈ క్రమంలో ఇంటి ఆవరణలోని సంపును పరిశీలించగా మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సూచన మేరకు ఫైర్ స్టేషన్ సిబ్బంది మృతదేహాన్ని బయటికి తీశారు. మృతురాలి ఒంటిపై ఎక్కడా గాయాలు ఉన్నట్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అయితే నీటి సంపు మూత బిగించి ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
కారు బోల్తా.. వ్యక్తి దుర్మరణం
బిజినేపల్లి: మండలంలోని పాలెం గ్రామ ఈద్గా సమీ పంలో శుక్రవారం ఉదయం కారు బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. హైదరాబాద్‌లోని గన్‌బజార్‌కు చెందిన మీర్జా అస్లం బేగ్ (42) భార్య షబానాబేగం, కుమారుడు సుభాన్‌బేగ్, కుమార్తె అస్రాతో కలిసి నాగర్‌కర్నూల్‌కు కారులో బయలుదేరారు. పాలెం గ్రామ ఈద్గా వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డుపై బోల్తాకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న మీర్జా అస్లం బేగ్‌కు తీవ్ర గాయా లు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. భార్య, పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
వివాహిత బలవన్మరణం
నాగర్‌కర్నూల్ క్రైం: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాకేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ కథనం మేరకు.. జిల్లాకేంద్రంలోని ఈశ్వర్‌కాలనీకి చెందిన పావని (38), భర్త నాగరాజు కొంతకాలంగా గొడవ పడుతున్నా రు. దీంతో మనస్తాపానికి గురైన పావని శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా మార్చురీకి తరలించారు. అక్క కుమారుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
గొండ్యాలలో వృద్ధుడు..
హన్వాడ: మండలంలోని గొండ్యాల్‌లో ఓ వృద్ధుడు శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయిని బాలకిష్టయ్య (65) కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. నొప్పి భరించక శుక్రవారం గ్రామశివారులోని తమ పొలంలో పురుగుమందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య ఆశమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
చికిత్స పొందుతూ
వృద్ధురాలు మృతి
పాన్‌గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లితండాకు చెందిన గమ్లి (60) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. తండావాసుల కథనం మేరకు.. గమ్లి సోమ వారం వంట చెరుకు నిమిత్తం తండా సమీపంలోని అడవికి వెళ్లింది. వంట చెరుకు సేకరించే క్రమంలో విషపు పురుగు కాటు వేసింది. శరీరంపై బొబ్బలు రావడంతో కుటుంబ సభ్యులు బుధవారం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. గమ్లికి నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.

మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణం

మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణం