
నేటికీ చిక్కని ఆచూకీ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ)సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రమాదవశాత్తు చిక్కుకోగా ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. 42 రోజులుగా మిగిలిన ఆరుగురు కార్మికుల కోసం సొరంగంలో అణువణువునా వెతుకులాట కొనసాగిస్తున్నారు. సొరంగం లోపల త్వవకాలు చేపడుతూ టీబీఎం భాగాలు స్టీల్, మట్టి, బురద, రాళ్లును వెలికితీసి బయటకు తరలిస్తున్నారు. టీబీఎం భాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది ప్లాస్మా కట్టర్‌తో కట్‌చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. నాలుగు ఎస్కవేటర్లు సహాయంతో మట్టిని తవ్వి కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి తీసుకువస్తున్నారు.
సహాయక చర్యలు వేగవంతం
సహాయక బృందాలకు కేటాయించిన పనిని పూర్తిస్థాయిలో చేపడుతూ సహాయక చర్యలు వేగవంతం చేశామని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. శుక్రవారం జేపీ కంపెనీ కార్యాలయంలో ఉన్నతాధికారులు, ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, ిహైడ్రా అధికారి సుదర్శన్‌రెడ్డి, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేటి చంద్రం, జేపీ కంపెనీ ప్రతినిధులతో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కన్వేయర్ బెల్టు పనులు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. సొరంగం లోపల 24గంటలు ఐదు ఎస్కవేటర్ల స్టీల్ భాగాలను, ప్రమాద ప్రదేశంలో భారీగా ఉన్న రాళ్లను లోకో ట్రైన్ ప్లాట్ ఫాం పైకి తరలించి మట్టి త్వవకాలు చేపడుతున్నామన్నారు. సొంరగం లోపల నీటిఊటను నిరంతరం బయటకు పంపింగ్ చేస్తున్నామని చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన వసతులు కల్పిస్తూ ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 42 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
టీబీఎం భాగాలను
లోకో ట్రైన్ ద్వారా బయటికి
పూర్తైన కన్వేయర్ బెల్టు
పునరుద్ధరణ పనులు