
పరిశ్రమలకు గడువులోగా అనుమతులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్):జిల్లాలోని పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పరిశ్రమలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీజీ ఐ–పాస్ కింద వివిధ శాఖల ద్వారా మంజూరు చేయాల్సిన అనుమతులను సమీక్షించి, నిర్దేశిత గడువు లోగా జారీ చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా చేయవలసిన పనులు మరియు మంజూరులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. టీ ప్రైడ్ పథకం కింద షెడ్యూల్ కులాలకు చెందిన వారికి 4, షెడ్యూల్ ట్రైబ్ చెందిన వారికి 2 చొప్పున వాహన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పార్థసారథి, భూగర్భజల వనరులశాఖ డీడీ రమాదేవి, ఎల్‌డీఎం భాస్కర్ పాల్గొన్నారు.
ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంగా భవానీప్రసాద్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం(ఎం)గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వచ్చారు. ఖమ్మం రీజి యన్‌లో డిప్యూటీ ఆర్‌ఎంగా పనిచేస్తున్న ఇత ను ఇటీవల బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ ఆర్‌ఎం(ఎం)గా పనిచేసిన శ్యామల హైదరాబాద్‌లోని మియాపూర్‌కు బదిలీపై వెళ్లారు.
ముగిసిన జాబ్‌మేళా
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాబ్‌మేళాకు 380 మంది విద్యార్థులు హాజరయా ్యరు. టీఎస్‌కేసీ, సైంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ జాబ్‌మేళాలో 120 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తాయని, అందరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐక్యూసీ కో–ఆర్డినేటర్ డా.జె.శ్రీదేవి, టీఎస్‌కేసీ కో–ఆర్డినేటర్ డా.హరిబాబు, మెంటర్ పి.స్వరూప, సైంట్, టీఎంఐ ప్రాజెక్టు మేనేజర్ వికాస్, ఐసీఐసీఐ బ్యాంకు హెచ్‌ఆర్ కిరణ్ పాల్గొన్నారు.
వైభవంగా అయ్యప్పస్వామి పంబ ఆరట్టు
స్టేషన్ మహబూబ్‌నగర్: అఖిలభారత అయ్యప్పదీక్ష ప్రచార సమితి పాలమూరు ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్పస్వామి పంబ ఆరట్టు (చక్రస్నానం) వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువింటి శ్రవణ్‌కుమార్ శర్మ, మోనేష్, పవన్ ఆధ్వర్యంలో స్థానిక చెలిమేశ్వర శివాలయం ఊటబావిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురుస్వామి రఘుపతిశర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. ప్రచార సమితి అధ్యక్షుడు సీమ నరేందర్, రామేశ్వర్, సతీష్, సంతోష్, శ్రీనుస్వామి, యుగంధర్, సత్యం, రఘురాంగౌడ్, కొండల్, కురుమయ్య పాల్గొన్నారు.
హక్కులు ఎంత ముఖ్యమో.. విధులు అంతే ముఖ్యం
హన్వాడ: రాజ్యాంగంలోని చట్టాల ప్రకారం హక్కులు ఎంత ముఖ్యమో విధులు సైతం అంతే ముఖ్యమని, ఇవి ప్రతి పౌరుడికి వర్తిస్తాయని జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. శుక్రవారం పల్లెమోని కాలనీ పంచాయతీలోని గురుకుల పాఠశాలలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. అనంతరం ఆమె ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులు, విధుల పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నిర్మూలన, మాన వ అక్రమ రవాణా అరికట్టడం, వెట్టిచాకిరి విముక్తి వంటి చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణనాయక్, ఎంపీడీఓ యశోదమ్మ, పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమలకు గడువులోగా అనుమతులు

పరిశ్రమలకు గడువులోగా అనుమతులు