
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ శివారు వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని కాపాడి ఆస్పత్రిలో చేర్పించినట్లు ఎస్‌ఐ యుగేందర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి గ్రామానికి సంబంధించిన ఓ వాట్సప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో అతని మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీస్ సిబ్బంది వెంకట్రాములు, రామణ్‌గౌడ్‌తో కలిసి రంగాపురం శివారులోని వ్యవసాయ పొలంలో గుర్తించి అడ్డుకొని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. సరైన సమయంలో స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను గ్రామస్తులు అభినందించారు. చాలని పేర్కొన్నారు.