
7 కిలోమీటర్ల దూరంలో...
మాకు వ్యవసాయమే జీవనాధారం. మా గ్రామంలో రైతువేదిక లేదు. మా ఊరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నచింతకుంటలో రైతువేదిక ఉంది. అక్కడికి గ్రామం నుంచి వెళ్లేందుకు రైతులెవరూ శ్రద్ధ చూపడం లేదు. అక్కడికి వెళ్లిన సరైన సూచనలు, సలహాలు అందడం లేదు.
– విష్ణుచారి, అల్లీపూర్, చిన్నచింతకుంట మండలం
నిర్వహణ ఖర్చులు భరిస్తున్నాం
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతువేదికల నిర్వహణ ఖర్చులను మేమే భరిస్తున్నాం. 2022 సంవత్సరం మొదట్లో కొంత నిర్వహణ ఖర్చులు మంజూరు చేసినప్పటికీ తర్వాత ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రైతు వేదికలకు వచ్చే విద్యుత్ చార్జీలు మాత్రం ఏడీఎ కార్యాలయం నుంచి చెల్లిస్తున్నారు.
– రాజేందర్ అగర్వాల్, మండల వ్యవసాయాధికారి, దేవరకద్ర
ప్రభుత్వానికి నివేదించాం
రైతులకు సాగులో సలహాలు, సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసింది. కరెంట్ బిల్లు, స్టేషనరీ, తాగునీటి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం మొదట్లో నిధులు విడుదల చేసింది. జిల్లాలోని 86 రైతు వేదికల నిర్వహణ నిధులు విడుదల కోసం ప్రభుత్వానికి నివేదించాం. – బి.వెంకటేష్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●

7 కిలోమీటర్ల దూరంలో...

7 కిలోమీటర్ల దూరంలో...