పెళ్లి బట్టలు అందిస్తున్న దేవర వినోద్
కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం ఇంద్రానగర్‌కు చెందిన దేవర వినోద్ లాక్‌డౌన్ సమయంలో గ్రామాల్లో కొందరికి నిత్యావసర స రుకులు పంపిణీ చేశారు. ఆ సమయంలో కొందరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లి చేసుకోలేదనే విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సామూహిక వివాహాలు జరిపిస్తుండడాన్ని స్ఫూర్తిగా తీసుకుని సామూహిక వివాహాలపై కుటుంబ సభ్యులు, తనకు తెలిసిన వారితో చర్చించాడు. సామూహిక వివాహాలు చేయించా లని నిర్ణయించుకున్నాడు. వినోద్ తన కూ తురు 21వ రోజుకు కానుకగా వచ్చిన తులం బంగారంతో 11 మందికి పుస్తెలు చేయించాడు. పుస్తెలు చేసిన వ్యక్తి కొంత బంగారం కలిపాడు. మరికొందరు ఆర్థికంగా సహకరించారు. దీంతో 11 జంటలకు ఇంద్రానగర్ గ్రామంలోని కనకదుర్గాదేవి స్వయంభూ మహాంకాళి ఆలయంలో గత ఏడాది ఫిబ్రవరి 10న వివాహం జరిపించాడు. పెళ్లికి వచ్చిన బంధువులకు భోజనాలు ఏర్పాటు చేశాడు. కాగజ్‌నగర్‌కు చెందిన గజ్జెల శ్రీనివాస్, సురేష్ వంట పాత్రలు, జెడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి నూతన జంటలకు బిందెలు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు బట్టలు అందజేశారు. రఫిక్ అనే వ్యక్తి పెళ్లి సమయంలో టెంట్ ఉచితంగా వేశాడు. మహంకాళి ఆలయ అర్చకుడిగా పని చేస్తున్న వినోద్ గ్రామంలో జరిగే పెళ్లిళ్లకు ఆలయం తరఫున పుస్తెమెట్టెలు అందించేలా సహకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment