సంక్షేమ, అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని, బిల్లులు సమర్పించాలని, మార్చి 2025 ఆర్థిక సంవత్సరం ము గింపు సందర్భంగా నిధుల విడుదల, పనుల పు రోగతి, ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ని వేదిక అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో ముఖ్య ప్రణాళిక అధి కారి సత్యం, మున్సిపల్ కమిషనర్లు, ఈఈలు, ఎంపీడీవోలతో ఆర్థిక సంవత్సరం ముగింపు సమీక్ష స మావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ శా ఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ పనులకు కేటా యించిన నిధులు ఖర్చు చేసి పనులు పూర్తి చేసినట్లయితే ధ్రువపత్రం సమర్పించాలని తెలిపారు.
ఏటీసీలతో ఆధునిక సాంకేతిక విద్య
నస్పూర్/మంచిర్యాలఅర్బన్/మందమర్రిరూరల్: అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ) ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల ఐటీఐ కళాశాల ప్రాంగణం, మందమర్రిలోని ఐటీఐ వెనుకాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల ఐటీఐ ప్రిన్సిపాల్ రమేశ్, మందమర్రి ఐటీఐ ప్రిన్సిపాల్ దేవానంద్, తహసీల్దార్ సతీష్‌కుమార్, ఆర్‌ఐ గణపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment