
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: యాసంగి పంట సాగుకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సాగునీటి శాఖ అధికారులు, వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతికుమారి మాట్లాడుతూ ఒక ఎక రం కూడా ఎండిపోకూడదని, వచ్చే పది రోజులు చాలా కీలకమైన సమయమని అన్నారు. ప్రాజెక్టు నుంచి చెరువులు నింపాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పర్యవేక్షించాలని తెలిపారు. తహసీల్దార్, నీటిపారుదల శాఖ ఏఈ, మండల వ్య వసాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలోని ఎత్తిపోతల పథకం, ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావుల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను జిల్లా అధికారులు ప్రతీరోజు సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
Comments
Please login to add a commentAdd a comment