లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
మంచిర్యాలటౌన్: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, పరీక్ష చేయించి న వారు, ప్రోత్సహించిన వారు శిక్షార్హులు అ వుతారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సలహా కమిటీ సమావేశంలో లింగ నిర్ధారణ పరీక్ష నేరమనే పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో 5 ప్రభుత్వ, 47 ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నా రు. స్కానింగ్ చేయించుకునే వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన, చేయించిన, ప్రో త్సహించిన వారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తారని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయి తే 9440586982 నంబరులో సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కృపాబాయి, పీఓఎన్‌సీహెచ్ డాక్టర్ రాధిక, వైద్యులు రాజ్‌కిరణ్, అభినవ్, విక్రం, హీల్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఇబ్రహీం, రాంప్రసాద్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment