బాలుడిని బలిగొన్న బాటిల్ క్యాప్
లక్సెట్టిపేట: తొమ్మిది నెలల బాలుడు కూల్‌డ్రింగ్ బాటిల్ క్యాప్ మింగి మరణించిన ఘటన లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఆదివారం జరిగింది. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సురేందర్‌కు భార్య, కుమార్తె, కుమారుడు రుద్రాయన్ ఉన్నారు. ఆదివారం సాయంత్రం బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంత కొమ్ముగూడెం వెళ్లారు. అక్కడ బాలుడు కూల్‌డ్రింక్ బాటిల్ మూత నో ట్లో పెట్టుకుని ఆడాడు. తర్వా త అది గొంతులోకి జారింది. ఊపిరి ఆడకపోవడంతో తల్లి దండ్రులు వెంటనే క్యాప్ తీసి కారులో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment