డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
● బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్
మందమర్రిరూరల్: డ్రగ్స్ రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో సీఐ శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ క్రికెట్ మ్యాచ్‌లో మందమర్రి సర్కిల్ పోలీస్, మందమర్రి ప్రెస్‌క్లబ్ తలపడ్డాయి. పోలీస్ టీం నిర్ణీత 14 ఓవర్లలో 111 పరుగులు చేయగా ప్రెస్‌క్లబ్ టీం 110 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో మందమర్రి సర్కిల్ పోలీస్ టీం విజయం సాధించింది. ఈ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏసీపీ హాజరై మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. డ్రగ్స్ క్రయ విక్రయదారులపైనే కాకుండా సేవించిన వారిపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఎస్సైలు, సిబ్బంది, ప్రెస్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment