నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత
భీమిని: కన్నెపల్లి మండలం సుర్జాపూర్ గ్రామంలో ఆదివారం 140 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయాధికారులు పట్టుకున్నారు. సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో గ్రామానికి చెందిన బేర నారాయణ ఇంట్లో వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొండగొర్ల రాజన్న అనే వ్యక్తి నాలుగు బస్తాల(140 కిలోల) పత్తి విత్తనాలు దాచి ఉంచాడు. వీటి విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తాండూర్ సీఐ కుమారస్వామి మాట్లాడుతూ ఆంధ్రాకు చెందిన సురేశ్ నుంచి కొనుగోలు చేసినట్లు నిందితులు తెలిపినట్లు వెల్లడించారు. సురేశ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment