రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
● ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టిన బస్సు ● బస్సులోని ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం ● పలువురికి గాయాలు.. రిమ్స్‌కు తరలింపు ● ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
ఆదిలాబాద్‌రూరల్: వారంతా రాత్రి వేళలో బస్సులో ప్రయాణిస్తున్నారు.. గాడనిద్రలో ఉన్నారు.. ఒ క్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో ఉలిక్కిపడ్డారు.. అప్పటికే ఎదురుగా ఉన్న ఐచర్ వాహనాన్ని బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ప్రయాణికులంతా చెల్లాచెదురయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. కొంద రు అద్దాలు పగులగొట్టి కిందికి దూకారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్‌తోపాటు అదనపు డ్రైవర్ తీవ్రగాయాలతో క్యాబిన్లో చిక్కుకు ని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘట న ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం వేకువజా మున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ కు వయా నాగపూర్ మీదుగా ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. అదే మార్గం గుండా నిర్మల్ వైపు నుంచి మహారాష్ట్ర వైపునకు కట్టెల లోడ్‌తో ఐచర్ వాహనం వెళ్తుంది. ఆదిలాబాద్‌రూరల్ మండల పరిధిలో గల జాతీయ రహదారిపై జియో పె ట్రోల్ పంపు ఎదుట ఐచర్ వాహనం టైర్ పగిలిపోయింది. డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక ఏర్పాటు చేయకుండా వాహనాన్ని రోడ్డుపైనే నిలిపాడు. దీంతో వెనక నుంచి వస్తున్న బస్సు ఐచర్‌ను వేగంతో ఢీ కొ ట్టడంతో బస్సు డ్రైవర్ ప్రదీప్ సాహు (35), పక్కనే ఉన్న అదనపు డ్రైవర్ లొచన్ సాహు (33) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే రిమ్స్‌కు తరలించారు. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ల మృతదేహాలను క్రేన్ సాయంతో తీశారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంబంధిత పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్పీ గౌస్ అలం, డీఎస్పీ జీ వన్‌రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై ముజాహిద్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమా దం జరిగిన తీరుపై ఆరా తీశారు. పోలీసులు తెలి పిన ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లొచ న్ సాహు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రదీప్ సాహులు కన్కెర్ ట్రావెల్స్‌పై బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరు శనివారం హైదరాబాద్ నుంచి సుమారు 40 మంది ప్రయాణికులతో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు బయలుదేరారు. ఈక్రమంలో ఆదిలాబాద్ వద్ద ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. ప్రమాద సూచిక లేకుండా రోడ్డుపై వాహనం నిలిపిన ఐచర్ వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిలో.. చత్తీస్‌గఢ్‌కు చెందిన కమ్‌లేష్ పాల్, జబల్‌పూర్‌కు చెందిన ముఖేష్ సాహు, మన్షి, సునిత సాహు, బన్‌స్కార్ అనిత, ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఎండీ సాహు, మధ్యప్రదేశ్‌కు చెందిన శివ్రి దీపక్, జైస్వాల్ ప్రదీప్ కుమార్, ప్రజ్ఞా ఉన్నారు.
లొచన్ సాహు, ప్రదీప్ సాహు మృతదేహాలు
నుజ్జునుజ్జయిన బస్సు ముందు భాగం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Comments
Please login to add a commentAdd a comment