కన్నేశారో.. కాజేస్తారు! | - | Sakshi
Sakshi News home page

కన్నేశారో.. కాజేస్తారు!

Published Wed, Mar 12 2025 7:38 AM | Last Updated on Wed, Mar 12 2025 7:34 AM

కన్నే

కన్నేశారో.. కాజేస్తారు!

● జిల్లాలో పెరిగిన బైక్‌ చోరీలు ● రెక్కీ నిర్వహిస్తూ అపహరణ ● ఈజీ మనీ కోసం అడ్డదారులు ● జాగ్రత్తే మేలంటున్న పోలీసులు

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రద్దీ మార్గాలు, శివారు కాలనీల్లో బైక్‌ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, రెస్టా రెంట్లు తదితర రద్దీ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం కొందరు నిలిపి ఉంచి న బైక్‌లు, ఆటోలతోపాటు లారీలను మాయం చే స్తున్నారు. ఈ నెల 1న జిల్లా కేంద్రంలోని సురభి గ్రాండ్‌ లాడ్జ్‌ పక్కన రహదారిపై నిలిపి ఉంచిన బి య్యం లోడ్‌తో ఉన్న లారీని ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఫి బ్రవరి వరకు జిల్లాలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు కలిపి 45 చోరీకి గురయ్యాయి.

ఈజీ మనీ కోసమే..

జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ప్రభుత్వ ఆస్పత్రి, షాపింగ్‌ మాల్స్‌ తదితర రద్దీ ప్రాంతాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా దొంగలు క్షణాల్లో వాహనాలు మాయం చేస్తున్నారు. కొందరు మద్యానికి బానిసై ఈజీ మనీ కోసం ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారు. ఇక కొందరు పగలంతా రెక్కీ నిర్వహించి రాత్రి వేళ వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. దొంగలు ఎక్కువగా పాత వాహనాలనే టార్గెట్‌ చేస్తుండటం గమనార్హం. ఎందుకంటే పాత బైక్‌లు పోతే వాటి యజమానులు ఠాణాల్లో ఫిర్యాదు చేసేదాకా వెళ్లరని వారి నమ్మకం. కొందరైతే బైక్‌లు ఎత్తుకెళ్లి వడ్డీ వ్యాపారుల వద్ద కుదువ పెట్టి రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు అప్పుగా తీసుకుని ఉడాయిస్తున్నారు. కొందరు స్క్రాప్‌ దుకాణాల్లో విక్రయిస్తున్నారు. మరికొందరు ఇతర ప్రాంతాలకు తరలించి రాత్రికి రాత్రే విడిభాగాలను స్క్రాప్‌ కింద విక్రయిస్తున్నట్లు సమాచారం.

రికవరీలో కనిపించని పురోగతి

జిల్లా కేంద్రంలో చోరీకి గురైన వాహనాల కేసుల దర్యాప్తులో రోజులు గడుస్తున్నా ఎలాంటి పురోగతి ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. మంచిర్యాలకు చెందిన ఓ న్యాయవాది తన ఇంటి ఎదుట నిలిపిన బైక్‌ చోరీకి గురై మూడేండ్లు గడిచింది. ఇప్పటికీ అది దొరకలేదు. ప్రస్తుతం పోలీస్‌ సిబ్బంది కొరత ఉండటంతో ముఖ్యమైన కేసుల దర్యాప్తు, బందోబస్తు, ఇతర కార్యక్రమాలకే ఉన్న కొద్దిమంది పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో 1.50లక్షల జనాభా ఉండగా ఒక్కటే పోలీస్‌స్టేషన్‌ ఉంది. సుమారు ఏడాదికి 700కు పైగా వివిధ కేసులు నమోదు కావడం, సరిపడా సిబ్బంది లేక పోవడంతో బైక్‌ చోరీల కేసులను ఛేదించలేక పోతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి పలు చోరీ ఘటనలు

జిల్లా కేంద్రంలో ఈ నెల 1న ఏసీసీ ఎఫ్‌సీ ఐ గోదాము సమీపంలో బియ్యం లోడ్‌తో ఉన్న లారీని దొంగలు ఎత్తుకెళ్లారు. లారీ ని ఎత్తుకెళ్లిన దొంగలు అందులోని బి య్యం మహారాష్ట్రలో విక్రయించారు. లారీని కూడా విక్రయించే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డారు.

జనవరి 14న జిల్లా కేంద్రంలోని ఇందిరనగర్‌కు చెందిన ఎలుగం సాయినాథ్‌ తన పల్సర్‌ బైక్‌ను సాయంత్రం 5గంటలకు ఇంటి ముందు నిలిపి ఉంచాడు. కాసేపటికి బయటకు రాగా బైక్‌ కనిపించలేదు. దీంతో బాధితుడు చోరీ ఐనట్లు గుర్తించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిబ్రవరి 27న తిలక్‌నగర్‌కు చెందిన కొంగ సాయినాథ్‌ తన బైక్‌ను రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఫారెస్ట్‌ కార్యాలయం ప్రహ రీ పక్కన నిలిపాడు. రైల్వేస్టేషన్‌లోకి వెళ్లి 10 నిమిషాల తర్వాత రాగా బైక్‌ అపహరణకు గురైంది. దీంతో బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

జాగ్రత్తలు తప్పనిసరి

వాహనం పోయిన తర్వాత బాధపడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాహనానికి ఉండే తాళంతో పాటు చక్రాలకూ వేయాలి. రోజుల తరబడి వాహనాన్ని వదిలేసి ఉంచరాదు. ఇంటి ఎదుట వాహనం పార్కింగ్‌ చేస్తే కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ వద్ద పార్కింగ్‌ షెడ్లలో నిలిపితేనే భద్రత ఉంటుంది. బైక్‌ దొంగలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించాం. ప్రతి ఒక్కరూ ఇంటి ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. లేదా కాలనీవాసులంతా కలిసి ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది.

– ఎగ్గడి భాస్కర్‌, మంచిర్యాల డీసీపీ

No comments yet. Be the first to comment!
Add a comment
కన్నేశారో.. కాజేస్తారు!1
1/1

కన్నేశారో.. కాజేస్తారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement