కంటి సమస్యల బారిన పడొద్దు
● కలెక్టర్ కుమార్ దీపక్ ● విద్యార్థినులకు కళ్లద్దాల పంపిణీ
మంచిర్యాలఅర్బన్: విద్యార్థినులు కంటి సమస్యల బారిన పడకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేజీబీవీ లో 20మంది విద్యార్థినులకు కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్‌బీఎస్‌కే బృందాలతో జిల్లాలోని 568 పాఠశాలలు, 164 రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 1,274 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో వైద్యశిబిరాలు ఏర్పా టు చేసి వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు, వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవా
ల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ఓ ఆర్‌ఎస్ ఫ్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్, జిల్లా వైద్యారోగ్యశాఖ ఉప వైద్యాధికారి అనిత, జిల్లా అంధత్వ నివారణాధికారి యశ్వంత్‌రావు, వైద్యాధికారులు ప్రసాద్, కృపాబాయి, వైద్యులు శ్వేత, చంద్రభాను, శిల్పశ్రీ, ఆప్తాల్మిక్ అధికారులు శంకర్, భాస్కర్‌రెడ్డి, ఎస్వో స్వప్న పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
జైపూర్: విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ సూచించారు. జైపూర్ కేజీబీవీని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహం ఆవరణలో నూతనంగా చేపట్టిన కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. మెనూలో ఏం భోజనం పెడుతున్నారని ఆరా తీశా రు. వంట గదిలో పిల్లలకు అందించే భోజనం, వంటను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థినుల కు భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడుతూ.. వార్షిక పరీక్షల్లో విద్యార్థులు భయం వీడి ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం రసూల్‌పల్లి, నర్వ, టేకుమట్ల, కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించి జాతీయ రహదారి పనుల పురోగతిని పరిశీలించారు. తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో, సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతి బాపురావు, ఎస్వో ఫణిబాల తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment