ఎల్‌ఆర్‌ఎస్ కోసం హెల్ప్‌డెస్క్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన ఎల్‌ఆర్‌ఎస్–2020 దరఖాస్తులకు సంబంధించిన హెల్ప్‌డెస్క్‌కు స్పందన లభిస్తోంది. మంగళవారం 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు, ఎంత ఫీజు చెల్లించాల్సి వస్తుంది.. వా రి దరఖాస్తు ఎక్కడ పెండింగ్ ఉంది.. తదితర వివరాలు తెలుసుకునేందుకు అధికసంఖ్యలో వచ్చారు. వారి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఫీజు చెల్లించిన వారికి 25శాతం రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో, కార్పొరేషన్ పరి ధిలోని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వందశా తం పూర్తి చేసేందుకు టౌన్ ప్లానింగ్ అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దరఖాస్తు గడువు పెంపు
మంచిర్యాలఅర్బన్: ఆరు నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 20వరకు పొడిగించినట్లు రాజీవ్‌నగర్ మోడ ల్ స్కూల్ ప్రిన్సిపాల్ బుచ్చన్న ఓ ప్రకటలో తెలిపారు. ఆరో తరగతిలో 100 సీట్లు, ఏడు నుంచి 10వ తరగతి వరకు మిగులు సీట్ల కోసం htpp//telanganams,cgg.gov. inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎస్టీ బాలుర హాస్టల్ తనిఖీ
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని ఎస్టీ కళాశాల బాలుర వసతి గృహాన్ని మంగళవారం జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీవో) అంబాజీ తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, హాజరు, రికార్డులు, వసతిగృహ పరిసరాలు, ఫర్నిచర్‌ను పరిశీలించారు. మెనూ అమలుపై ఆరా తీశారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఇబ్బంది గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని నిర్వాహకుడు లక్ష్మణ్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment